గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (18:51 IST)

నాటు నాటు పాటకు చిన్మయి కవలలు డ్యాన్స్.. అంతా సమంత..?

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం తమ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులతో కలసి బాలి పర్యటనకు వెళ్లి అక్కడ సేద తీరింది. తాజాగా చెన్నైకి తిరిగి వచ్చింది. తన స్నేహితురాలు, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇంటికి వెళ్లింది.

చిన్మయి పిల్లలతో కలిసి ఆటలాడుతూ సందడి చేసింది. వారితో నాటు నాటు పాటకు స్టెప్పులేయించింది. పిల్లలతో కలిసి సమంత ఆడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.