శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (10:32 IST)

కుషి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సమంత.. తర్వాతే అమెరికాకు..?

Vijay Deverakonda, Samantha
మయోసైటిస్ చికిత్స కోసం సమంత త్వరలో వెళ్లనుంది. చికిత్స ఖర్చుల గురించి మీడియా తప్పుదోవ పట్టించే కథనాలను సమంత ఇటీవల తప్పుపట్టింది. సమంతా యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే ముందు "కుషి"ని ప్రచారం చేయనుంది. ఇందులో భాగంగా, ఈ నెలాఖరులో జరిగే "కుషి" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సమంత హాజరు కానుంది.  
 
ఇక కుషి రొమాంటిక్ డ్రామాతో తన కమిట్‌మెంట్‌ను పూర్తి చేసుకుని ఆగస్టు చివరి వారంలో ఆమె అమెరికా వెళ్లనుంది. ట్రీట్‌మెంట్ కోసం సమంత రెండు నెలల పాటు అమెరికాలో ఉండి తిరిగి హైదరాబాద్ రానుంది. 
 
ఇప్పటికే సమంత నటనకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చింది. దీంతో 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్లీ సినిమాలు చేసే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి.