Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కేసీఆర్ పుట్టిన రోజు.. కేటీఆర్, కవిత ట్వీట్స్- స్పెషల్ సాంగ్ వీడియో

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫిబ్రవరి 17న) పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. గులాబీ నేతలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే తరహాలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత ఆయనక

Written By selvi
Updated: శనివారం, 17 ఫిబ్రవరి 2018 (13:41 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫిబ్రవరి 17న) పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. గులాబీ నేతలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే తరహాలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత ఆయనకు తమదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌కు "హ్యాపీ బర్త్ డే డాడ్.. మంచి ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 
 
కేటీఆర్ తన తండ్రిపై అద్భుతమైన కవితను కూడా జతచేశారు. 
 
వీరాధి వీరుడు అతడు,
విజయానికి బావుట అతడు
ఆవేశపు విల్లంబతడు,
ఆలోచన శిఖరంబతడు, 
తలవంచనియోధుడు అతడు
అభయానికి బాసట అతడు, 
జనహితమే అభిమతమై సాగుతున్న 
గౌతముడు... అంటూ కేటీఆర్ పోస్టు చేసిన కవిత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ''హ్యాపీ బర్త్ డే డియర్ ఫాదర్.. మీ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్విస్తున్నాను. మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం'' అంటూ కవిత కేసీఆర్ ఫొటోతో ట్వీట్ చేశారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. మంత్రి జోగురామన్న సమక్షంలో మంచిర్యాల జిల్లాలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా.. అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టెంటుకు మంటలు అంటుకోగా మంత్రి జోగు రామన్న క్షేమంగా బయటపడ్డాడు. ఇక ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments