Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్... పెద్దమ్మ తల్లి గుడిలో కొత్త ప్రయోగం

Written By శ్రీ
Updated: ఆదివారం, 2 ఆగస్టు 2020 (20:54 IST)
జూబ్లీహిల్స్‌లో కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక శని, ఆదివారాలు అయితే భక్తుల రద్దీ ఇక చెప్పనక్కరలేదు. అయితే శ్రావణ మాసం మూలంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున వరుస కడుతున్నారు. 
 
అయితే కరోనావైరస్ మూలంగా భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా భౌతిక దూరం పాటించేలా 
సర్కిల్స్ వేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే ఎంతచెప్పినా కూడా భక్తులు నిబంధనలు పట్టించుకోకపోవడంతో కొత్త ప్రయోగం చేపట్టారు ఆలయ నిర్వాహకులు.
 
భక్తులు సామాజికదూరం పాటించేలా గొడుగులు ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చిన భక్తులకు ఒక్కొక్కరికి ఒక్కో గొడుగు ఇస్తున్నారు. దర్శనం పూర్తయ్యే వరకు భక్తులు గొడుగు పట్టుకునే ఉండాలి. అమ్మవారు దర్శనం పూర్తయ్యాక  బయటకు వచ్చిన తరువాత మాత్రమే ఆ గొడుగు ఆలయ సిబ్బందికి తిరిగి ఇవ్వాలి.

ఈ గొడుగులు ప్రయోగం చాలా బాగుందని, దీనివల్ల లోపలికి వచ్చిన భక్తులు కచ్చితంగా భౌతికదూరం పాటిస్తున్నారు అని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments