సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (09:55 IST)

ఆదిలాబాద్‌లో కరోనా భయం.. 41 పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. మహరాష్ట్రలో కేసుల తీవ్ర పెరుగుతున్న తరుణంలో, దాన్ని ఆనుకోని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో సైతం కేసుల సంఖ్య పెరగడంతో హైరానా మొదలైంది. అయితే మహ ప్రభావం ఏమి లేదని టెస్టుల సంఖ్య పెంచామని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేకపోతే కోరి కరోనాకు స్వాగతం పలికినట్లు అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే గతకొద్ది రోజులుగా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. జిల్లాలో తాజాగా రికార్డ్ స్థాయిలో 41 కరోనా పాజిటీవ్ కేసులు నిర్థారణ అయ్యాయి. దాంతో అటు ప్రజల్లోనూ, ఇటు అధికారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో కొత్తగా 41 కరోనా పాజిటీవ్ కేసులు నిర్థారణ అయ్యాయి .ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 320 ఉండగా, ఇప్పటి వరకు మొత్తం 5వేల 494 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం మరణాలు సంఖ్య 49 నమోదయ్యాయి.