మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 21 జనవరి 2019 (21:08 IST)

మహిళా అధ్యాపకురాలిని డీన్ లైంగికంగా వేధిస్తున్నారు... ఆందోళన...

హైదరాబాద్‌: తార్నాకలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో డీన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ కళాశాలలోని ఓ అధ్యాపకురాలిని లైగింక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ముందు బాధితులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు, స్థానిక నాయకులు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘ నాయకులు పోలీసు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ డీన్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని, అతనిని వెంటనే విధుల నుంచి తొలగించకపోతే కళాశాల ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.