గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (12:13 IST)

ఆ స్విచ్ లు పని చేయకపోవడం వల్లనే జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం పెరిగిందా?

శ్రీశైలం ఎడమ కాల్వ జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాద తీవ్రత పెరగడానికి రెండు స్విచ్ లు పని చేయకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

పవర్‌హౌజ్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ప్యానల్‌ బోర్డుకు మంటలు అంటగానే.. దానికి కరెంట్‌ సరఫరాను ఆపేయడానికి సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

మంటలు అంటుకున్న ప్యానల్‌ బోర్డుకు రెండు వేర్వేరు మార్గాల నుంచి బ్యాటరీల నుంచి డైరెక్ట్‌ కరెంట్‌(డీసీ) అందుతుండేది.

ప్రమాద సమయంలో రెండు స్విచ్‌లూ పనిచేయలేదని తేలింది. ఆ స్విచ్‌లు పనిచేసి ఉంటే... ఐదు నిమిషాల్లోపే అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.