ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:28 IST)

అప్పుల భారానికి కుటుంబం బలి.. హైదరాబాద్ లో నలుగురు ఆత్మహత్య

హైదరాబాద్ లో రుణభారానికి కుటుంబం బలైపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం పలువురిని విషాదంలో ముంచేసింది.

మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. మృతుల్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హరీష్‌ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో నివాసముంట్ను హరీష్‌ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అసలు విషయం వెలుగు చూసింది. మృతులను హరీష్‌, స్వప్న, గిరీష్‌, సువర్ణగా పోలీసులు గుర్తిచారు. ఆర్థిక ఇబ్బందులతో నలుగురూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.