మీరు గేటెడ్ కమ్యూనిటీలో వున్నారా? అయితే ఇది షాకింగ్ న్యూసే
హైదరాబాద్ నగరంలో మీరు గేటెడ్ కమ్యూనిటీలో వున్నారా? అయితే మీకు ఇది షాకింగ్ న్యూసే. తెలంగాణ గత నెల నుంచి విద్యుత్తు పంపిణీ సంస్థ కరెంట్ ఛార్జీలు పెంచడంతో గేటెడ్ కమ్యూనిటీలపై భారం భారీగా పడింది.
సాధారణ వినియోగదారులకు కరెంట్ ఛార్జీలు యూనిట్‌కు అర్థ రూపాయి చొప్పున పెంచగా, గేటెడ్ కమ్యూనిటీలకు (హెచ్టీ వినియోగదారులకు) యూనిట్‌కు రూపాయి పెరిగింది. ఇవే కాకుండా ఇతర ఛార్జీలు కలిపితే తడిసి మోపు అవుతుందని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు వాపోతున్నాయి.
వ్యక్తిగత ఇళ్ల మాదిరి గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్రతి ఫ్లాట్‌కి డిస్కం సరఫరా చేయదు. కమ్యూనిటీ ప్రారంభంలో వుండే సీటీమీటర్ వరకే సరఫరా చేస్తుంది.
అక్కడే మీటర్ ఆధారంగా రీడింగ్ నమోదు చేసి బిల్లింగ్ ఇస్తుంది. ఇంటర్నల్‌గా ఒక్కో ఫ్లాటుకు సరఫరా చేసే కరెంట్‌కు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లే రీడింగ్ చేసి బిల్లులు వసూలు చేస్తాయి.
సాధారణంగా అపార్ట్‌మెంట్‌లోని ఒక యజమానికి 128 యూనిట్లకు రూ.604 బిల్లు చెల్లించాల్సి వస్తే.. అదే గేటెడ్ కమ్యూనిటీలో రూ.1056 చెల్లించాల్సి వస్తోంది.