గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (19:06 IST)

తెలంగాణాలో గుండెపోటుతో బాలిక మృతి

Heart attack
ఇటీవలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అనేక మంది చనిపోతున్నారు. వీరిలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అదే జరిగింది. మండలపరిధిలోని కస్నతండ అనే గ్రామంలో గుండెపోటుతో ఓ బాలిక మృత్యువాతపడింది. 
 
ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆవిరేని పద్మ అనే మహిళ కుమార్తె పింకీ (16) అనే బాలిక ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఇటీవలికాలంలో ఈ రాష్ట్రంలో వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్న విషయం తెల్సిందే. కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటులకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువైంది.