మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (10:11 IST)

కేసీఆర్... ప్రజల ఆకలి చావులను పట్టించుకోవడం లేదు : గోషామహల్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ స్థానం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథా ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ స్థానం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథా ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల ఆకలి చావులను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్‌కు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు.
 
ఇదిలావుండగా, ధూల్‌పేటలో గుడుంబా తయారీని మానేసిన వేలాది మందికి ప్రత్యామ్నాయం చూపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రెండేళ్ల క్రితమే తాను ప్రశ్నిస్తే, స్వయంగా ధూల్‌పేటకు వచ్చి, ప్రజలను ఆదుకునే చర్యలు చేపడతానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇంతవరకూ దాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కేవలం మాటల గారడీతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఆయన ఆరోపించారు.