గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (18:25 IST)

సీఈసీ గ్రూపునకు భలే డిమాండ్ ... టి సర్కారు కాలేజీల్లో జోరుగా అడ్మిషన్లు

కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది జీవితాలను తలకిందులు చేసింది. లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అదేసమయంలో తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తూ వచ్చిన తల్లిదండ్రులు ఇపుడు ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించేందుకు అమితాసక్తిని చూపుతున్నార. ఫలితంగా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. 
 
ప్రస్తుతం తెలంగాణాలో జూనియర్ కాలేజీల్లో ఆడ్మిషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ 1,00,685 వరకు దాటాయి. గతేడాది కన్నా 25 వేల అడ్మిషన్లు అదనంగా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో ఈ సంవత్సరం సర్కార్ జూనియర్ కాలేజీల్లో రికార్డ్ స్థాయిలో అడ్మిషన్స్ నమోదయ్యాయి. 
 
ముఖ్యంగా, కరోనా కారణంగా ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. రాష్ట్రంలోని ఫలక్‌నుమా జూనియర్ కాలేజీలో అత్యధికంగా 2,550 విద్యార్థులు చేరారు. సర్కార్ జూనియర్ కాలేజీల్లో సీఈసీ గ్రూప్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది.