శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (16:23 IST)

చౌటుప్పల్ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మండలంలోని ధర్మోజిగూడలో ఉన్న ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫ్యాక్టరీలో వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి. రసాయన పరిశ్రమ కావడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల భారీగా పొగలు కమ్ముకున్నాయి. 
 
ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది.