మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (16:31 IST)

మాన్సాస్ ట్రస్టు.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర ఉత్తర్వులు

మాన్సాస్ ట్రస్టు విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్‌గజపతి రాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా నియమిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. 
 
సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన అనుబంధ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది.