శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (20:32 IST)

తెలంగాణలో ఎంసెట్‌ అడ్మిషన్స్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎంసెట్‌ అడ్మిషన్స్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 25న ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనుండగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 9వరకు ధ్రువపత్రాల స్లాట్‌ బుకింగ్‌ చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. 
 
సెప్టెంబర్‌ 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, సెప్టెంబర్‌ 13 వరకు వెబ్‌ఆప్షన్స్‌ నమోదు.. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుపుతామని స్పష్టం చేసింది. అనంతరం సెప్టెంబర్‌ 15 నుంచి 20 వరకు కాలేజీల్లో ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాలని పేర్కొంది. రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
 
అలాగే పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులు ఇంజినీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈనెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 
 
26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. అలాగే 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. సెప్టెంబరు 2న ఈసెట్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్ లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
 
అనంతరం సెప్టెంబరు 13న ఈసెట్ తుది విడత ప్రవేశాల షెడ్యూలు ప్రారంభం కానుంది. సెప్టెంబరు 14న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన, సెప్టెంబరు 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 18 నుంచి 20 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు. సెప్టెంబరు 18న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.