శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 9 ఆగస్టు 2021 (10:29 IST)

జస్టిస్‌ కేశవరావు కన్నుమూత, తెలంగాణ కోర్టులకు సెలవు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. కేశవరావు (60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్‌ కేశవరావు మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్థానం ఇవాళ సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కేశవరావు సేవలు అందించారు. 
 
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. కేశవరావు న్యాయమూర్తి మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్‌ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.