మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:16 IST)

ఆగస్టు 30 నుంచి ఎంసెట్ తొలి దశ కౌన్సిలింగ్

తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎంసెట్‌) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలింగ్‌ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సమావేశమైన టీఎస్‌ ఎంసెట్‌-2021 అడ్మిషన్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుని, కౌన్లింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. 
 
ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ధ్రువపత్రాల స్లాట్‌ బుకింగ్‌. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు. 
 
సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబ్‌ 15 నుంచి 20వ తేదీలోగా ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సిందిగా సూచన. మరిన్ని వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌ https://tseamcet.nic.in లో ఆగస్టు 28వ తేదీనుండి లభించనున్నట్లు అడ్మిషన్స్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.