మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Mohan
Last Modified: గురువారం, 20 సెప్టెంబరు 2018 (18:24 IST)

హైదరాబాద్ మెట్రో స్టార్ట్.. వాహనాల పార్కింగ్ మాటేమిటి?

హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ సమస్యలతో ఎప్పుడూ అల్లాడుతుంటుంది. సాధారణంగా ఎక్కువ జనాభాను కలిగి ఉండటంతో పాటు అనేక ఐటీ సంస్థలు, మరిన్ని ఫార్మా కంపెనీలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండటం వలన రవాణా సమస్యగా మారింది. అందులోనూ కొద్దిపాటి వర్షానికి కూడా గంటల కొ

హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ సమస్యలతో ఎప్పుడూ అల్లాడుతుంటుంది. సాధారణంగా ఎక్కువ జనాభాను కలిగి ఉండటంతో పాటు అనేక ఐటీ సంస్థలు, మరిన్ని ఫార్మా కంపెనీలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండటం వలన రవాణా సమస్యగా మారింది. అందులోనూ కొద్దిపాటి వర్షానికి కూడా గంటల కొద్ది ట్రాఫిక్ రోడ్డుపై నిలిచి ఉండిపోయిన సందర్భాలు కోకొల్లలు. 
 
అయితే ఈ సమస్యకు కొంతమేర ఉపశమనం కలిగించడం కోసం సిద్ధమైన హైదరాబాద్ మెట్రో రైలు ఈ నెల 24వ తేదీన గవర్నర్ నరసింహన్ చేతుల మీద ప్రారంభం కానుంది. అమీర్‌పేట నుండి ఎల్బీనగర్ వరకు 16 కిలోమీటర్లు పాటు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. అయితే అందులో ప్రయాణించేందుకు వచ్చే ప్రయాణీకుల వాహనాల పార్కింగ్ ఇప్పుడు సరికొత్త సమస్యకు దారి తీస్తోంది. 
 
ఇప్పటికే ఇరుకైన రోడ్లలో మెట్రో స్టేషన్‌ల నిర్మాణం జరిగింది. అక్కడ పార్కింగ్ స్థలం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందులోనూ మెట్రో కిందన ఉన్న రోడ్లలో పార్కింగ్ స్థలాల కేటాయింపు, యూటర్న్‌లు అలాగే సిగ్నల్ ఏర్పాట్లు కూడా ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఇక ఈ సమస్యను అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీసులతో సహకరించవలసిందిగా నిర్వాహకులు ప్రయాణీకులను కోరుతున్నారు.