శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2018 (16:33 IST)

హైదరాబాద్‌లో పేలిన పెట్రోల్ ట్యాంకర్

హైదరాబాద్‌ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయింది. ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా నిప్పంటుకుని పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు.

హైదరాబాద్‌ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయింది. ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా నిప్పంటుకుని పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెట్రోల్‌ ట్యాంకర్‌ నుంచి అక్రమంగా పెట్రోల్ తీసేందుకు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. భయంతో స్థానికులు పరుగులు తీస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
పెట్రోల్ ట్యాంకర్‌తో పాటు పలు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ తరహా ప్రమాదాలు జరగడం ఇది తొలిసారి కాకపోవడం గమనార్హం.