శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (10:42 IST)

తాగొద్దని ఎంత చెప్పినా భర్త వినిపించుకోలేదు.. నిండు గర్భిణీ ఏం చేసిందంటే?

తాగుడుకు బానిసైన కారణంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డ దాఖలాలు ఎన్నో వున్నాయి. తాజాగా ఓ నిండు గర్భిణీ భర్త ఎంత చెప్పినా.. తాగడం మానకపోవడంతో.. ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్ పీస్ పరిధిలోని చిలకనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిలకనగర్‌లో జార్ఖండ్‌కు చెందిన దేవి అనే నిండు గర్భిణీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 
 
భర్త తాగుడుకు బానిస కావడం, ఎంత చెప్పినా సరే తన భర్త అసలు వినకపోవడం… రోజు గొడవలు జరగడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని స్థానిక ఉప్పల్ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. తాగొద్దని ఎంత చెప్పినా భర్త వినిపించకపోవడంతో.. తినడానికి తిండి కూడా లేకపోవడంతోనే సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.