శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (17:57 IST)

హోమ్ గార్డ్‌తో అఫైర్.. చితక్కొట్టి కిటికీకి తాడుతో చేతులు కట్టేశారు... ఎక్కడ?

ఓ హోమ్ గార్డ్‌తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన ఇల్లందు పట్టణంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఎల్ బి ఎస్ నగర్‌లో నివాసం ఉంటున్న సంధ్య అనే ఒంటరి మహిళ కిరాణా షాపులో వర్కర్‌గా పనిచేస్తుంది. ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్‌గా పనిచేసే నరేష్ అనే యువకుడు ఇక్కడి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 
 
ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేష్ ఆదివారం మధ్యాహ్నం ఆ మహిళ ఇంట్లో ఆమెతో మాట్లాడుతుంటే నరేష్ తల్లితో పాటు ఆయన బంధువులు ఆ మహిళా ఇంటిపై దాడి చేసి ఆమెను కొట్టి బయట కిటికీకి తాడుతో చేతులు కట్టేశారు.
 
అయితే ఆ మహిళ మాత్రం తన వద్ద నుంచి కొందరికి డబ్బులు ఇప్పిస్తాడని డబ్బుల కోసం వచ్చాడని చెబుతుంది. గత కొన్ని రోజులుగా నరేష్‌కు ఇంటికి సరిగా రాకపోవడం తరచుగా ఆ మహిళ ఇంటికి వెళ్లడం తదితర కారణాల వలన ఆ మహిళకు నరేష్ హోంగార్డు మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోందని ధృఢంగా నమ్మిన ఆయన బంధువులు ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల జోక్యంతో ఈ గొడవ సద్దుమణిగింది.