Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం.. టి సర్కార్

Written By సెల్వి
Updated: మంగళవారం, 22 జూన్ 2021 (10:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. జూలై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని స్ఫష్టం చేసింది. ఆన్‌లైన్ విధానంలోనే స్కూళ్లు ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
 
రాష్ట్రంలో జూన్ 20 వ తేదీ నుంచి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో… ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది తెలంగాణ సర్కారు. 
 
ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ ఎప్పటిలాగే నడవనున్నాయి.  ఇక అంతర్రాష్ట్ర ప్రయాణాలు, బస్సు సర్వీసుల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉదయం వేళ ప్రయాణాలు కొనసాగుతుండటగా, తాజా నిర్ణయంతో రాత్రివేళ కూడా బస్సులు తిరగనున్నాయి. 
 
ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతోనే లాక్​డౌన్ ఎత్తివేశామని రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం అందించాలని కోరింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments