ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 27 జులై 2020 (17:11 IST)

జర్నలిస్ట్‌లూ సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కి ఇప్పుడు వెళ్ళండి: టీఎస్ హైకోర్టు

సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కు ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది కదా, ఇప్పుడు వెళ్ళండి అంటూ మీడియాకు హైకోర్టు సూచించింది. రోడ్డు- భవనాల శాఖ కార్యదర్శి, హైదరాబాద్ సీపీ నేతృత్వంలో మీడియా కవరేజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ఎప్పుడుపడితే అప్పుడు పంపించడం పత్రికా స్వేచ్చకు విరుద్ధమని మాకు ప్రతి రోజు అనుమతి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటీషనర్ కోరారు.
 
దీనికి హైకోర్టు స్పందిస్తూ ఇప్పుడు వెళ్ళిరండి అసలు ఏం జరుగుతుందో చూడాలని మీడియాను సూచించింది హైకోర్టు.అసలు మీడియాపై ఇన్ని ఆంక్షలు పెడుతున్నారా?? తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. పత్రిక స్వేచ్ఛ పైన ఓపెన్ కోర్టులో సుదీర్ఘ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.