గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (13:19 IST)

అమిత్ షాతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్

తెలంగాణలో అమిత్ షా టూర్‌లో తాజా అప్డేట్ వచ్చింది. తెలంగాణకు వస్తోన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలువనున్నారు. 
 
అమిత్ షాతో డిన్నర్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు తెలంగాణ బీజేపీ నేతలు. అమిత్ షా ఆహ్వానం మేరకు తారక్ 15 నిమిషాల డిన్నర్ భేటీలో పాల్గొననున్నారు. 
 
కాగా ఇటీవల అమిత్ షా ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయిన ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా తారక్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.