శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:05 IST)

రాయలసీమ కోసం దక్షిణ తెలంగాణను నాశనం చేస్తారా? కేసీఆర్ పైన వంశీచంద్ రెడ్డి ఆగ్రహం

దక్షిణ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో దక్షిణ తెలంగాణకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని అన్నారు.
 
రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను అడ్డుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన చర్యలు అవమానాలకు తావిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలే కేసీఆర్‌కు ఎక్కవయ్యాయని విమర్శించారు. రాయలసీమను రతనాలసీమ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఉందని వంశీచంద్ దయ్యపట్టారు.
 
రాయల సీమకు సస్యశ్యామలం చేయడంపై తమకు అభ్యంతరంలేదని అయితే ఇదే సమయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసే చర్యలను అంగీకరించబోమని చెప్పారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాలకోసమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని ఆరోపించారు.