బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (14:18 IST)

రొటీన్ నుంచి కొంత విరామం తీసుకున్నాను.. మంత్రి కేటీఆర్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "భీమ్లా నాయక్". ఈ నెల 25వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 'భీమ్లా నాయక్' చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 
అయితే, తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. తన సోదరులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, సాగర్ చంద్రల చిత్రం 'భీమ్లా నాయక్' విడుదలను పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, రొటీన్ నుంచి కొంత విరామం తీసుకున్నానని ఆయన చెప్పారు. మొగిలయ్య, శివమణి వంటి బ్రిలియంట్ సంగీత విద్వాంసులు కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.