Daily Horoscope
✕

నానక్‌రామ్‌గూడలో సిలిండర్ పేలి ఒకరు మృతి

Written By సెల్వి
Updated: మంగళవారం, 23 నవంబరు 2021 (17:03 IST)
నానక్‌రామ్‌గూడలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సిలిండర్ పేలడంతో మూడంతస్తుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించగా, గాయపడ్డ 11 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
వివరాల్లోకి వెళితే.. నానక్‌రామ్‌గూడలోని ఓ నివాస సముదాయంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4.55 గంటలకు పేలుడు జరిగిన సమయంలో నివాస సముదాయంలో అందరూ నిద్రిస్తుండటం, బిల్డింగ్ కూలి శకలాలు మీదపడటంతో ఎక్కువ మందికి గాయాలయ్యాయి.
 
పేలుడు ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. చికిత్స పొందుతోన్నవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అన్నీ చూడండి

రీల్ హీరో కాదు... రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే..: టైగర్‌ ష్రాఫ్‌పై నెట్టింట ప్రశంసలు

Ramayana premiere: లాస్ ఏంజెల్స్‌ అకాడమీ మ్యూజియంలో రామాయణ వరల్డ్ ప్రీమియర్

కథ చెప్తానని.. చీరలోనే హోటల్ గదికి రమ్మన్నాడు.. ఆ గదిలో ఒక మంచం మాత్రమే... సోనాలి కులకర్ణి

నటి రాఖీ సావంత్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ.. ఎందుకంటే?

చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో నూతన చిత్రం

తర్వాతి కథనం
Show comments