Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కన్నబిడ్డపైనే తండ్రి లైంగిక దాడి... భార్య వదిలేసింది.. రెండో భార్య?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 18 మార్చి 2022 (10:36 IST)
కన్నతండ్రే తన బిడ్డను కాటేశాడు. సంవత్సరాల పాటు బిడ్డపై పైశాచికంగా ప్రవర్తించాడు. కానీ అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు కారణంగా ఆ కామాంధుడు అరెస్ట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చాడు. 
 
నగరంలో బోయిన్‌పల్లిలో ఉంటూ రోజువారి కూలి పనులు చేస్తుండేవాడు. మొదటి భార్యతో విభేదాల కారణంగా విడాకులిచ్చి విడిపోయాడు. అతనికి ఓ పాప వుంది. ఇంకా మొదటి భార్య మరో పెళ్లి చేసుకుని తనకు పుట్టిన కూతురిని తండ్రి రమెష్ వద్దే వదిలి పెట్టింది. 
 
కాగా రమెష్ సైతం రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా తన వద్ద పెరుగుతున్న మొదటి భార్య కూతురు గత కొన్ని సంవత్సరాలుగా ఉండడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఆమెను బెదిరిస్తూ లైంగికంగా లొంగదీసుకున్నాడు. 
 
ఇక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే విషయాన్ని గమనించి భర్తను హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదు. దీంతో రమెష్ రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమెష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం