శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హోలీ పండుగ
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (15:10 IST)

హోలీ రోజున హనుమంతుడి పూజ.. నేతితో దీపమెలిగిస్తే..?

హోలీ రోజున హనుమంతుడి పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. హోలికా దహనం రాత్రి హనుమంతుడిని పూజించాలని చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో, పూజకు ముందు స్నానం చేసి, ఆపై ఇంట్లో ఉన్న హనుమంతుని విగ్రహం ముందు కూర్చుని, ఆయనను పూజించాలి.  
 
పూజలో, హనుమంతునికి జాస్మిన్ ఆయిల్ వాడటం మంచిది. పుష్పాలు, నైవేద్యం సమర్పించాలి. పూజలో హనుమంతుని ముందు నెయ్యి దీపం వెలిగించాలి. పూజ తర్వాత, హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్ పఠించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
అలాగే హోలీ పూర్ణిమ రోజున ఉపవాసం లేదా వ్రతాన్ని ఆచరించి, విష్ణుమూర్తిని మరియు, చంద్రుడిని పూజించిన భక్తులకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. అటువంటి భక్తులు పాపాల నుండి కూడా విముక్తి పొందుతారు.