గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (21:49 IST)

మంగళ ప్రదోష వ్రతం.. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు..?

ప్రదోషం రోజున, సంధ్యా కాలం పూజలు చేస్తుంటారు. ఈ సమయంలో ప్రార్థనలు, పూజలు జరుపుకుంటారు. సూర్యాస్తమయానికి ఒక గంట ముందు, భక్తులు స్నానం చేసి పూజకు సిద్ధమవుతారు.
 
ఈ ప్రదోష కాలంలో శివునికి ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలు జరుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలతో అభిషేకాలు చేయిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. బిల్వార్చనతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ పూజకు అనంతరం ప్రదోష వ్రత కథను వింటారు లేదా శివ పురాణం నుండి కథలు చదువుతారు.
 
అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రదోష సమయంలో శివాలయాలను దర్శించుకోవడం ద్వారా సర్వ మంగళం చేకూరుతుంది. మంగళ ప్రదోష వ్రతాన్ని చేపట్టే వారికి సంపద చేకూరుతుంది. 
 
ఈ వ్రతాన్ని ఉపవాసాన్ని భక్తితో, విశ్వాసంతో పాటించడం ద్వారా సంపద, ఆయురారోగ్యాలు చేకూరుతాయి.