సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు : మంత్రి కేటీఆర్

ktrminister
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ పంజాగుట్ట కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఆయనతో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. 
 
అంబేద్కర్ చెప్పినట్టుగానే నడుచుకుంటున్నామని, ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుంతూ ముందుకు సాగుతున్నామని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనకే సాధ్యమైందన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు సాహసోపేతమైన పథకం అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. 
 
కొత్త పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కేంద్ర పాలకులను డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు.