ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (19:09 IST)

పీసీసీ చీఫ్ నియామకంపై ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ నూతన పీసీసీ చీఫ్ నియామకంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటులా పీసీసీ పదవిన అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పీసీసీ చీఫ్ పదవి కోసం ఇంతకాలం లాబీయింగ్ చేస్తూ ఢిల్లీలో ఉన్న ఆయన.. చివరికి ఆ పదవికి తనకు దక్కకపోవడంతో ఆదివారం నాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ ఎంపికపై ఎవరూ ఊహించని రీతిలో సంచలన కామెంట్స్ చేశారు.
 
పీసీసీ పదవిని ఇంతకాలం పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు ఇస్తారని అనుకున్నానని, కానీ ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని కట్టబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని అన్నారు. టి కాంగ్రెస్.. టీటీడీపీ లాగా మారవద్దని ఆకాంక్షిస్తున్నానని కామెంట్స్ చేశారు.