ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (09:26 IST)

అమ్మాయిలపై లైంగిక దాడులు... ఈ చెప్పుతో కొడితే..?

అమ్మాయిలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్న తరుణంలో అత్యాచారాలు, లైంగిక దాడుల నుంచి బయటపడేందుకు మహిళలకు ఉపయోగకరంగా వుండే పాదరక్షలను తయారైనాయి. ఈ పాదరక్షలను హైదరాబాదుకు చెందిన యువకుడు తయారుచేశాడు. వివరాల్లో

అమ్మాయిలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్న తరుణంలో అత్యాచారాలు, లైంగిక దాడుల నుంచి బయటపడేందుకు మహిళలకు ఉపయోగకరంగా వుండే పాదరక్షలను తయారైనాయి. ఈ పాదరక్షలను హైదరాబాదుకు చెందిన యువకుడు తయారుచేశాడు. వివరాల్లోకి వెళితే హిమాయత్ నగర్‌లో ఉండే మండల సిద్ధార్థ అనే యువకుడు.. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్ తర్వాత రీసెర్చ్‌పై దృష్టిని సారించాడు. 
 
సోషల్ మీడియా ద్వారా శాస్త్రీయ అంశాలు, సాంకేతిక నిపుణుల సలహాలు స్వీకరించి ఈ పాదరక్షలు తయారు చేశాడు. ఈ చెప్పుల ద్వారా లైంగిక దాడి చేసే వ్యక్తులను కొడితే షాక్ తగులుతుంది. అంతేగాకుండా.. సమాచారం కుటుంబ సభ్యులకు, పోలీసులకు చేరిపోతుంది. 
 
''పిజో ఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్'' సూత్రం ఆధారంగా పనిచేసే ఈ చెప్పుల్లో అమర్చిన బ్యాటరీలు నడుస్తూ ఉంటే చార్జింగ్ అవుతుంటాయి. ఎవరినైనా కొడితే.. ఆ వ్యక్తికి స్వల్ప విద్యుదాఘాతం తగులుతుంది. ఈ పాదరక్షలను వాడుకోవడం ద్వారా అమ్మాయిలు తమను తాము సకాలంలో రక్షించవచ్చునని సిద్ధార్థ చెప్తున్నాడు.