శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (14:49 IST)

రాహుల్ మా డార్లింగ్ : మాజీ పీఎం మన్మోహన్‌

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను తమ డార్లింగ్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను తమ డార్లింగ్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
 
డిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయగా, ఆయన వెంట మన్మోహన్ సింగ్‌తో పాటు.. అనేక సీనియర్ నేతలు ఉన్నారు. నామినేషన్ తర్వాత మన్మోహన్ మాట్లాడుతూ, 'రాహుల్‌ కాంగ్రెస్‌ డార్లింగ్‌. పార్టీ సంప్రదాయాలను ఆయన నిబద్ధత'తో ఆచరిస్తారు అని కొనియాడారు. 
 
కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్‌ గడువు సోమవారంతో ముగియనుంది. రాహుల్‌ తప్ప కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానుంది.