Dharma Sangrah
✕

తెలంగాణాలో రాత్రిపూట కర్ఫ్యూ మరో వారం పొడగింపు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (15:44 IST)
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట కర్ఫ్యూను మరో వారంరోజుల పాటు పొడగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఏప్రిల్ 20వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కొత్త కేసులు వెల్లువలా వస్తుండడంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది.
 
మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 7,646 పాజిటివ్ కేసులు రాగా, 53 మంది మృత్యువాత పడ్డారు.
 
తెలంగాణలో క‌రోనా కేసుల  విజృంభ‌ణ‌ కొన‌సాగుతోంది. బుధవారం రాత్రి 8 గంట‌ల నుంచి గురువారం రాత్రి 8 గంటల మ‌ధ్య 7,646 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 5,926 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,55,618 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,261గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,441 మందికి క‌రోనా సోకింది. 

అన్నీ చూడండి

Sekar Master Car Accident : చిరంజీవితో కాకా ఐటం సాంగ్ చిత్రీకరణ జర్నీలో శేఖర్ మాస్టర్‌కు కారు ప్రమాదం జరిగింది ?

Sree Vishnu : కొత్తదనంతో కూడిన వినోదంతో చంద్రయాన్ ఆకట్టుకుంటుంది : హీరో శ్రీవిష్ణు

Allari Naresh :నేర ప్రవృత్తి, మనిషిలోని విభిన్న కోణాలు నేపథ్యంగా అల్లరి నరేష్ ఆల్కహాల్ సిద్ధమైంది

Trivikram Srinivas : త్రివిక్రమ్ మార్పు డివివి దానయ్య బేనర్ లో ఎన్.టి.ఆర్. సినిమా వరకేనా?

కావ్య మారన్‌తో అనిరుధ్ రవిచంద్రన్ వివాహం.. జీవితంలో ఒక్కసారి మాత్రమే.. 11.11... (video)

తర్వాతి కథనం
Show comments