శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (11:31 IST)

నీట మునిగిన నిర్మల్ జిల్లా... సరదాగా చేపలు పడుతున్న మంత్రి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి నిర్మల్ జిల్లా అతలాకుతలమైపోయింది. ఈ జిల్లా పూర్తిగా నీటమునిగిపోయింది. నెల రోజులకు క్రితం ప్రారంభించిన నిర్మల్ జిల్లా కలెక్టరేట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. 
 
ఎడ‌తెరిపి లేని వ‌ర్షాలతో నిర్మల్‌ పట్టణం జలమయమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీ అంతా నీట మునిగింది. కాలనీలో మొదటి అంతస్తు వరకు వరకు వర్షపు నీరు వచ్చి చేరింది. ముంపు కాలనీల్లోని ఇండ్లలో వందలాదిమంది వరదనీటిలో చిక్కుకున్నారు. నాటు పడవల సహాయంతో జనాలను బయటకు సురక్షితంగా తరలిస్తున్నారు. బైంసా డివిజన్‌లో చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
 
అయితే, జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు చెరువుల కబ్జాలతో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడతుంటే.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం అధికార యంత్రంగంతో సరదాగా విహార యాత్ర వెళ్లి చేపలు పడుతున్నారని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.