సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (14:31 IST)

మహారాష్ట్రలో వానలు బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 32 మంది మృతి

Maharastra
మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలోని మహడ్‌ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
దీంతో ఇప్పటివరకు 32 మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింది మరికొందరు చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి చెప్పారు.
 
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో నాలుగు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొల్హాపూర్‌ జిల్లాలోని 47 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.