Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

1 నుంచి తెలంగాణలో ఆన్‌లైన్‌ తరగతులు

Written By ఎం
Updated: మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:32 IST)
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఉపాధ్యాయులంతా ఈ నెల 27 నుంచి పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
కరోనా పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. గత కొన్ని రోజులుగా ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి. మరికొన్నాళ్లు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది.

దీనిపై సుమారు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖకు అనుమతించింది.

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments