శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (09:08 IST)

ప్రయాణికుల డిమాండ్ : ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్ల పొడగింపు

train
దీపావళి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపింది. అయితే, దీపావళి పండుగ గడిచిపోయినప్పటికీ ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గలేదు. దీంతో ఈ ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీంతో 27వ తేదీ గురువారం నుంచి 31వ తేదీ సోమవారం వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపనుంది. 
 
27న సికింద్రాబాద్ - యశ్వంత్‌పూర్, 28న యశ్వంత్‌పూర్ - సికింద్రాబాద్, 30న తిరుపతి - సికింద్రాబాద్, 31న సికింద్రాబాద్ - తిరుపతి, 30న కాచిగూడ - యశ్వంత్‌పూర్, 31న యశ్వంత్‌పూర్ - కాచిగూడ, 28న కాచిగూడ - పూరి, 29న సంత్రాగచ్చి - సికింద్రాబాద్, 28న నాందేడ్ - విశాఖపట్టణం, 29న విశాఖపట్టణం - నాందేడ్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్ళను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంది.