రాముడు తెలంగాణాకు.. రాముడు ఆస్తులు ఆంధ్రాకు!!

మంగళవారం, 15 జులై 2014 (08:59 IST)
పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు సోమవారం రాజ్యసభ ఆమోదముద్ర వేయడంతో భద్రాచలం రాముడు తెలంగాణ ప్రాంతానికి, ఆ రాముని ఆస్తుల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినట్టు అయింది. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదముద్ర వేయడంతో ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగానూ రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనంకానున్నాయి. 
 
అయితే ఈ విలీనం ప్రభావం భద్రాచలం శ్రీరాముడు మీద కూడా పడింది. దీని వల్ల భద్రాచలం శ్రీరాముడు తెలంగాణలో కొలువవుతుండగా.... ఆయన ఆస్తులలో చాలాభాగం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనం కానున్నాయి. ముంపు మండలాలను ఏపీలో కలపనుండడంతో భద్రాచలం ఆలయానికి సంబంధించిన జటాయువు మందిరం కూడా ఏపీలో కలవనుంది. ఖమ్మం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రం సమీపంలోని ఎటపాక గ్రామంలో జటాయువు మందిరం ఉంది. ఈ గ్రామం ఏపీలో కలవనుండడంతో జటాయువు మందిరం ఆంధ్రప్రదేశ్ సొంతం కానుంది.
 
రామాయణంలో జటాయువు పాత్ర చాలా ముఖ్యమైనది. జటాయువు ఒక వయసు మళ్లిన గద్ద. రాముడి తండ్రి దశరథుడికి మిత్రుడు జటాయువు. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకు పోతున్నప్పుడు.. రావణునితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత రక్తసిక్త స్థితిలో సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడికి కనిపించి, రావణుడి వివరాలు చెప్పి వీరమరణం పొందుతాడు. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా దాని దహన సంస్కారాలు చేసినట్టు రామాయణంలో ఉంది. 

అన్నీ చూడండి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్

Jagapathi Babu: ప్రోస్థెటిక్ మేకప్ తో చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి : జగపతి బాబు

Show comments