Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రేవంత్‌ రెడ్డికి భద్రత పెంచండి... ఖర్చు ఆయనే భరించాలి... హైకోర్టు

Written By శ్రీ
Updated: సోమవారం, 29 అక్టోబరు 2018 (19:19 IST)
టీ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరిన విధంగానే ఆయనకు భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని హైకోర్టు ఆదేశించింది. అయితే భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్ రెడ్డే భరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తనకు కేంద్ర సిబ్బందితో నిరంతరం నలుగురు ఉండేలా భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పైన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
 
రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా కేసీఆర్‌పై పోరాడుతున్నందున తనకు ప్రాణ హాని ఉందని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల సమయం కాబట్టి తనకు 4+4 భద్రత కల్పించాలని కోరారు. తనకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని.. కేంద్ర భద్రత కావాలని ఈసీని, కేంద్రాన్ని కోరినప్పటికీ స్పందన లేదన్నారు.  వాదనల అనంతరం హైకోర్టు.. రేవంత్ రెడ్డి కోరిన విధంగా భద్రత పెంపును కల్పించాలని, ఖర్చులను ఆయనే భరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం