Daily Horoscope
✕

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (14:10 IST)
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే ఐదు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
అలాగే, వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, మేడ్చర్ ప్రాంతంలో క్రమక్రమంగా ప్రారంభమైన వర్షం.. ఆ తర్వాత నగర వ్యాప్తంగా విస్తరించింది. చార్మినార్, బహదూర్‌పూర్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. 
 

అన్నీ చూడండి

Fahadh Faasil : ఫహాద్ ఫాజిల్ హీరోగా థ్రిల్ల‌ర్ మూవీ అసరీరి జనవరి1 రిలీజ్

Deepika Padukone : పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్ - అందుకే ప్రభాస్ తో చేయనన్న దీపికా పదెకొనే !

Sony Telugu channel : ప్రముఖ ఛానల్స్ కు పోటీగా సోనీ తెలుగు ఛానల్ - చెన్నైలో వచ్చే ఏడాది ప్రారంభం ?

ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడితే నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది, ఆస్పత్రి పాలయ్యా: మలయాళీ సింగర్ సలీం

తిరునెల్వేలిలో యంగ్ రివల్యూషనరీ లీడర్ త్రిష ఫోరమ్.. ఫోటో వైరల్

తర్వాతి కథనం
Show comments