ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (12:21 IST)

నా ఇంట మనవడు జన్మించాడు : టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్

Revanth Reddy
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాత అయ్యారు. ఆయన చిన్న కుమార్తె నైమిష పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తన ఇంట మనవడు జన్మించాడన్న విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. 
 
"నా చిన్న కుమార్తె నైమిష గత వారం మగబిడ్డను ప్రసంవించింది. బిడ్డకు, తల్లికి మీ అందరి దీవెనలు కావాలి" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాకుండా, మనవడి ఫోటోలను కూడా ఆయన తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు.