నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్... హైదరాబాదులో....
హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ఎస్ఆర్ నగర్‌లో లక్కీ గుప్తా తనగదిలో నైట్రోజన్ గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహ్యత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. నొప్పి తెలియకుండా ఎలా ఆత్మహత్య చేసుకోవాలో విషయంగా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది.
బాలానగర్‌లో 5వేల రూపాయిలకు నైట్రోజన్ గ్యాస్ కొనుగోలు చేసిన లక్కీ గుప్తా దాన్ని గదిలో లీక్ చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని సూసైడ్ నోట్‌లో వివరించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందన్న మనస్తాపంతో తాజుద్దీన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలోని చిట్టి నగర్ చెందిన తాజుద్దీన్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదిలా ఉంటే పోలీసులు మందలించారనే కారణంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని చిట్టిగనర్‌లో మార్చిలో చోటు చేసుకుంది. తాజుద్దీన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తనతో కలిసి పనిచేస్తున్న యువతితో సన్నిహితంగా మెలిగిన తాజుద్దీన్ ప్రేమించాలని కోరాడు.
తన వెంట పడుతున్నాడని ఆ యువతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిపించి మందలించారు. యువతి వెంటపడొద్దని హెచ్చరించి వదిలేశారు. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారన్న మనస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.