Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రెండు రోజుల్లో శ్రీరెడ్డికి అదేగతి.. ఏంటది?

శ్రీరాముడు, సీతపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కత్తి మహేష్‌నే కాదు శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని కూడా నగరం నుంచి బహిష్కరించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా కుల, మతాల మధ్య

Written By TJ
Updated: గురువారం, 12 జులై 2018 (17:37 IST)
శ్రీరాముడు, సీతపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కత్తి మహేష్‌నే కాదు శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని కూడా నగరం నుంచి బహిష్కరించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా కుల, మతాల మధ్య ఈ గొడవ ముదురుతుండడంతో హైదరాబాద్ డిజిపి ఇద్దరిని నగరం నుంచి బహిష్కరించేశారు. అయితే ఈ గొడవకన్నా ముందే పెద్ద గొడవ చేసింది శ్రీరెడ్డి.
 
శ్రీరెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో అవకాశాలు రాలేదని తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని రోడ్డుపైకి లాగింది శ్రీరెడ్డి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోను శ్రీరెడ్డి వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా శ్రీరెడ్డి ఏదో ఒకటి చేస్తూ అటు సామాజిక మాధ్యమాల్లోను, ఇటు ప్రసార మాధ్యమాల్లోను వైరల్‌గా మారుతోంది.
 
తెలంగాణా రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎవరు మాట్లాడినా వారిని బహిష్కరించాలన్న నిర్ణయానికి కెసిఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే శ్రీరెడ్డిని కూడా మరో రెండురోజుల్లో నగర బహిష్కరణ చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ఇదే జరిగితే శ్రీరెడ్డి తెలంగాణా సిఎంపై ఎలాంటి విమర్శలు చేస్తుందోనన్నది ఆసక్తికరంగా మారుతోంది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments