మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (10:22 IST)

సురేంద్రపురి కుందా సత్యనారాయణ కన్నుమూత

kunda satyanarayana
సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ బుధవారం కన్నుమూశారు. సురేంద్రపురి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అతి సమీపంలో ఉంది. శివుడు, నాగదేవత భారీ విగ్రహాలతో పాటు మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలకు దృశ్య రూపమిచ్చి కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత సత్యనారాయణకే దక్కుతుంది. కాగా సత్యనారాయణ 1938 జూన్‌ 15న తేదీన జన్మించారు. 
 
ఆయనకు ఆయనకు భార్య హైమవతి, కుమారులు శ్రీనివాస్‌, ప్రతాప్‌, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు. ఆయన మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
 
కాగా అనారోగ్యం బారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్‌ జ్ఞాపకార్థంగా యాదగిరిగుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం దగ్గర సత్యనారాయణ సురేంద్రపురి పేరుతో హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శిల్పకళకు పెద్దపీట వేస్తూ నిర్మించిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది.