బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (17:46 IST)

తెలంగాణలో మాస్కు తప్పనిసరి.. లేకుంటే వెయ్యి ఫైన్

తెలంగాణలో మాస్కును తప్పనిసరి చేసింది రాష్ట్ర సర్కారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు రూ. 1000 జ‌రిమానా విధిస్తార‌ని తేల్చిచెప్పింది. మాస్కు ధ‌రించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని.. శానిటైజేషన్ కూడా తప్పనిసరి చేసుకోవాలని కోరింది. 
 
సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరింట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది. దీంతో మరోసారి ప్రపంచం అంతా అలర్ట్ అయిపోయింది. మాస్కులు పెట్టుకోకుండా రిలాక్స్ అయితే ముప్పు తప్పదు అన్నట్లుగా ఆయా ప్రభుత్వాలు హెచ్చరికలు జారి చేస్తున్నాయి. ఈక్రమంతో తెలంగాణ ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకపోతే రూ.1000 జరిమానా తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది.
 
ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 12 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏళ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని తెలంగాణ ప్రజారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. అందుకే తప్పనిసరిగా అందరూ మాస్క్ ధరించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.