బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (13:26 IST)

తెలంగాణాలో ఆర్టీసీ చార్జీల బాదుడు తప్పదంటున్న బాజిరెడ్డి!

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుడు తప్పదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి అంటున్నారు. పైగా, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును ప్రజలు కూడా అర్థం చేసుకోని సహకరించాలని కోరుతున్నారు. 
 
బుధవారం ఆర్టీసీ చార్జీల పెంపుపై రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో అధికారులతో ఒక సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డ గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతపాదన గత నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటరుకు రూ.20 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు చొప్పున పెంచాలని ప్రతిపాదించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాల వల్లే ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, ఇటీవలి కాలంలో డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని దీనికి కేంద్రమే కారణమన్నారు. తెలంగాణ ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుందని తెలిపారు. ఈ ధరలు పెరగడం వల్ల ఇపుడు ప్రయాణికులపై భారం మోపక తప్పడం లేదన్నారు.