మరోసారి బాదుడు, రూ. 100 పెరిగిన గ్యాస్ సిలిండర్
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగాయి. వాణిజ్య అవసరాల కోసం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ ధరను ఈరోజు మళ్లీ పెంచి సామాన్యులు, వ్యాపారులపై మరింత భారం మోపారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర సిలిండర్‌పై రూ.100 పెరిగింది. నవంబర్ 1న ధర పెరిగిన తర్వాత ఇది రెండోసారి పెంపుదల.
ఈ ధర పెరిగిన తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.2101 అవుతుంది. ముంబైలో ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్ ధర సిలిండర్ రూ.2,051. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.2,174.50గా ఉంది. చెన్నైలో ఎల్‌పిజి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర సిలిండర్‌కు 2,234.50.