శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: గురువారం, 16 జులై 2020 (14:37 IST)

తెలంగాణ మిర్యాలగూడ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

తెలంగాణ ప్రజా ప్రతినిధులను కరోనా వెంటాడుతున్నది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ప్రతినిధులను భయాందోళనలో ముంచింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు సైతం కరోనా బారిన పడ్డారు.
 
జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో రెండు రోజులు క్రితం ఆయన పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలడంతో తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు.